పటాన్చెరు: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : గుమ్మడిదల మండల వైద్య అధికారి మధుకర్
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని గుమ్మడిదల మండల వైద్య అధికారి మధుకర్ అన్నారు.సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ మాట్లాడుతూ... డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు వంటి వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తాయని చెప్పారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలని, తాగు నీటి పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు.