కొల్లాపూర్: నార్లాపూర్ నుంచి ఎల్లూరుకు నీటి విడుదల: లక్ష ఎకరాలకు సాగునీరు
నార్లాపూర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు. దీనితో అదనంగా లక్ష ఎకరాలకు సాగునీరు అందనుంది. ప్రాజెక్టు పనులపై బీఆర్ఎస్ విమర్శలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. కాలువల నిర్మాణం పూర్తికాకుండా నీటి విడుదల సాధ్యం కాదని స్పష్టం చేశారు.