శివంపేట్: మెదక్: ఇంట్లో 20 తులాల బంగారం మాయం
మెదక్ జిల్లా శివంపేట మండలం సికిందలాపూర్లో మహేష్ అనే వ్యక్తి ఇంట్లో 20 తులాల బంగారం కనిపించకుండా పోయింది. బతుకమ్మ సందర్భంగా బీరువా చూడగా బంగారం లేకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ జరిగిందా లేదా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.