శివంపేట్: చాకరిమెట్ల ఆలయంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పూజలు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని శివంపేట మండలం చిన్న గొట్టిముక్కల శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి స్వామి వారికి విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు.