కొడిమ్యాల: దొంగలమర్రి బైపాస్ రోడ్డులో రైల్వే కల్వర్టును ఢీకొన్న ద్విచక్ర వాహనం వ్యక్తికి తీవ్ర గాయాలు
జగిత్యాల జిల్లా,కొడిమ్యాల మండలం,దొంగలమర్రి బైపాస్ రోడ్డు లోని రైల్వే కల్వర్టును ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటన సోమవారం 9:10 PM కి చోటుచేసు కుంది,జగిత్యాల నుండి వేములవాడకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పరమేశ్వర్ దొంగలమర్రి బైపాస్ నుండి వేములవాడకు వెళ్తుండగా,వేములవాడ వైపు నుండి కారు అతివేగంగా వస్తు కారు అతి సమీపము వద్దకు రావడంతో కార్ నుండి తప్పించుకునే ప్రయత్నం లో,రైల్వే కల్వర్టును ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది దీంతో బైక్ పైన ఉన్న పరమేశ్వర్ కు తలకు చేయికి తీవ్ర గాయాలు అయ్యాయి,గాయాలైన పరమేశ్వర్ని హుటాహుటిన స్థానికులు ఓ ప్రైవేట్ వాహనంలో జగిత్యాల కు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు,