శ్రీశైలం: శ్రీశైలం నియోజకవర్గం పెండింగ్ పనులపై రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవుని కలిసిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
నేడు అమరావతి సచివాలయంలోని క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తో శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి నిధుల విడుదల అంశంపై విస్తృతంగా చర్చించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు కొనసాగుతున్న అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తయ్యేలా అవసరమైన నిధులను విడుదల చేయాలని ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి, సంబంధిత అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.