రోలుగుంట మండలంలో రోడ్డు నిర్మాణాలను పూర్తి చేయాలని గిరిజనుల విజ్ఞప్తి
అసంపూర్తి రోడ్డు నిర్మాణాలను పూర్తి చేయాలని అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ, ఎంకే.పట్నం పంచాయతీ కొండశిఖర గ్రామాల ఆదివాసీ గిరిజనులు కోరుతున్నారు. వైబి.పట్నం నుంచి లోసింగి, అర్ల నుంచి పిత్రిగడ్డకు మంజూరైన రోడ్లను పూర్తి చేయకపోవడంతో ఇక్కడి గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే.గోవిందరావు తెలిపారు. తక్షణమే ఈ రోడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.