కథలాపూర్: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి:ఉపాధ్యాయులు
జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్ మండలం అంబారిపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం ఉపాధ్యాయులు,విద్యార్థులు మొక్కలు నాటారు. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. పాఠశాల ఆవరణలో 100 మొక్కలు నాటినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు,ఉపాధ్యాయులు జవ్వాజి రవి, జవ్వాజి ఆదిరెడ్డి, వెంకటేశ్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని వృక్షాలు అయ్యేంతవరకు సంరక్షించాలని కోరారు.