కోటిపల్లి గోదావరిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం, మరో యువకుడి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
కె.గంగవరం మండలం కోటిపల్లి గోదావరిలో గల్లంతైన ఇద్దరు వ్యక్తుల్లో మేడిశెట్టి వీర బ్రహ్మం(38) మృతదేహం లభ్యమైంది. మరొక వ్యక్తి ఆచూకీ కోసం గోదావరి నదిలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని పామర్రు ఎస్సై జానీ బాషా సోమవారం తెలిపారు. కనకదుర్గమ్మ నిమజ్జనం కోసం కోటిపల్లి గౌతమి గోదావరి నదిలో దిగి ఇద్దరు వ్యక్తులు గల్లంతైన విషయం విధితమే.