మంచిర్యాల: ఈ నెల 5న ప్రజావాణి రద్దు - జిల్లా కలెక్టర్ వెల్లడి
మంచిర్యాల జిల్లాలో ఈ నెల 5న నిర్వహించాల్సిన ప్రజావాణిని రద్దు చేశారు. నిర్మల్ జిల్లాలో జరగనున్న ఉమ్మడి అదిలాబాద్ జిల్లా సమీక్షా సమావేశానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరుకానుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.