పటాన్చెరు: డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం నేటితరం యువతకు స్ఫూర్తిదాయకం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం నేటితరం యువతకు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. డాక్టర్ అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలోని అబ్దుల్ కలాం కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. అబ్దుల్ కలాం ఆశయాలను భవిష్యత్తు తరాలకు అందించాలన్నారు.