శ్రీశైలం: సున్నిపెంటలో అంగన్వాడీ సెంటర్లకు నాసిరకం గుడ్లు సరఫరా పై ఉన్నతాధికారుల విచారణ
సున్నిపెంటలో అంగన్వాడీ సెంటర్లకు నాసిరకం గుడ్లు సరఫరా అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ICDS అధికారులు స్పందించారు. ఆ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సూపర్వైజర్ అంజలి దేవి అంగన్వాడీ సెంటర్-17ను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడి అంగన్వాడీ టీచర్, ఆయాకు కౌన్సెలింగ్ ఇచ్చారు. కోడిగుడ్లు సరఫరా చేసే వారికి కూడా నాణ్యమైన, తాజా కోడిగుడ్లను సరఫరా చేయాలని సూచించారు.