కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలంలో ఏపీఐఐసీ (APIIC) కోసం భూములు కోల్పోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం 12 గంటలు కర్నూలు ఆర్డీఓ కార్యాలయం ముందు భూ నిర్వాసితుల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పరిశ్రమల హబ్ పేరుతో 30 వేల ఎకరాలు సేకరించి, అందులో 10 వేల ఎకరాలకుపైగా ఏపీఐఐసీకి కేటాయించారని, భూములు తీసుకున్నప్పటికీ పరిహారం చెల్లించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.