విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో, పేదవారికి ప్రభుత్వ పథకాల గండి, జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు.
కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం, మరియు నియోజకవర్గంలోని, పేద ప్రజలకు అందవలసిన ప్రభుత్వ పథకాలు, విద్యుత్ రీడింగ్ మీటర్లు ఎక్కువగా ఉన్నాయని, విద్యుత్ యూనిట్లు ఎక్కువగా వస్తున్నాయని, అందకపోవడంతో పేద ప్రజలు ఆందోళన చెందుతున్నారని. ఈ విషయంలో విద్యుత్ శాఖ అధికారుల తప్పిదం వల్ల. పేదవారికి సైతం 3 నుండి 10 మీటర్ల , 300 యూనిట్ల పైబడి యూనిట్లు చూపించడంతో. అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని. ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు, ఉన్నత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ, రాష్ట్ర మంత్రివర్యులకు వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందని అప్పలకొండ ఆదివారం మీడియాకు తెలిపారు.