మండపేట: ముగిసిన నామినేషన్ల ఘట్టం... మండపేటలో 16 మంది...
25 సెట్లు దాఖలు ...
మండపేట అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. నామినేషన్ల ఆరంభం నుండి ఇప్పటివరకు మొత్తం ఇక్కడ 16 మంది అభ్యర్థులు మొత్తం 25 సెట్లు నామినేషన్లను దాఖలు చేశారు .ఈ క్రమంలో రేపు శుక్రవారం నామినేషన్ల పరిశీలన నిర్వహిస్తున్నట్లు మండపేట ఎన్నికల అధికారి డి వీ ఎస్ ఎల్లా రావు తెలిపారు. ఈ నెల 28 ఆదివారం కావడంతో ఈనెల 27 శనివారం, 29 సోమవారం నామినేషన్ల ఉపసంహరణ నిర్వహిస్తారు. ఈనెల 29 సాయంత్రం ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తారు.