కడప నగర ట్రాఫిక్ సీఐగా ఏ. సురేష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గతంలో కడప జిల్లాతో పాటు అన్నమయ్య జిల్లాలో సీఐగా పనిచేసిన ఆయన, కొత్తగా కడప ట్రాఫిక్ విభాగానికి నియమితులయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సురేష్ రెడ్డి, నగరంలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు చేపడతామని తెలిపారు. మైనర్లతో వాహనాలు నడపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.నగర ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పక పాటించాలని, ట్రాఫిక్ నియంత్రణలో ప్రతి ఒక్కరి సహకారం అవసరమని ఆయన కోరారు.