శ్రీశైలం: ఆత్మకూరు పట్టణంలోని మెప్మా కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మాలో అవినీతి జరిగి
ఆత్మకూరు పట్టణంలోని మెప్మా కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మాలో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో విచారణ నిర్వహించేందుకు మెప్మా స్టేట్ మిషన్ మేనేజర్ ఆదినారాయణ ఆత్మకూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు విచారణను అడ్డుకునే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.పోలీసుల భద్రత మధ్య మెప్మా కార్యాలయానికి చేరుకున్న రాష్ట్ర స్థాయి అధికారి ఆదినారాయణ, అందిన ఫిర్యాదులపై సంబంధిత అధికారులు, సిబ్బందితో మాట్లాడి విచారణ చేపట్టారు.