శ్రీశైలం: మహానంది బండిఆత్మకూరు మండలాల్లో ఏదేచ్ఛగా ఎర్రమట్టి తవ్వకాలు. చోద్యం చూస్తున్న అధికారులు చూస్తున్న అధికారులు
జిల్లాలోని మహానంది, బండిఆత్మకూరు మండలాల్లో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. నల్లమల అడవికి సమీప ప్రాంతాల్లో యథేచ్ఛగా ఎర్రమట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే భారీగా మట్టిని తవ్వి తెలుగుగంగ కాల్వపైగా లారీలతో తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఓ మట్టి లారీ అదుపుతప్పి కాల్వలో పడిపోయిన ఘటన కలకలం రేపింది. అయినప్పటికీ అక్రమ మట్టి తవ్వకాలపై అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ఈ అక్రమ దందా సాగుతున్నా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోకపోవడంతో మట్టి మాఫియా మరింత రెచ్చిపోతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.