అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీనివాస విద్యానికేతన్ లో శుక్రవారం నిర్వహించిన సైన్స్ ఎక్స్పో లో విద్యార్థులు తమ తమ ప్రాజెక్టులతో అబ్బురపరిచారని స్థానిక ఎస్ఐ శివ పేర్కొన్నారు. పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాసులు హెచ్ఎం సుమ ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ ఎక్స్పో కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ తాసిల్దార్ మధుసూదన్, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లికార్జున లతో కలిసి ఎస్సై రిబ్బన్ కతరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 250 ప్రాజెక్టులతో ఆకట్టుకున్న విద్యార్థులకు కరస్పాడెంట్, హెచ్ఎం లతో ఎస్ఐ కలిసి ప్రోత్సాహక బహుమతులను అందించి అభినందించారు.