వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి: గురుపల్లిలో జిల్లా విద్యాశాఖ అధికారి పీ.బ్రహ్మాజీరావు
చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి పీ.బ్రహ్మాజీరావు ఉపాధ్యాయులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం పాడేరు మండలంలోని కాడెలి పంచాయతీ గురుపల్లి ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల స్థాయి ఏ విధంగా ఉందని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న ఆహార పథకంలో ప్రభుత్వ మెనూను ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు.