కర్నూలు: అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి:అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి లలిత
అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్య దర్శి లలిత కోరారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు కర్నూలులో అంగన్వాడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయ కు వినతిపత్రం ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీలకు వేతనాలు పెంచకుండా, సంక్షేమ పథకాల అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని ఈనెల 12న చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.