హత్నూర: హత్నూరలో ఘనంగా ఆర్ఎస్ఎస్ శత జయంతి వేడుకలు, పురవీధుల గుండా భారీ ర్యాలీ
సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన అత్యురాలు ఆర్ఎస్ఎస్ శతజయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించగా యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు దేశ రక్షణ కోసం సైనికుల్లా ముందుంటారని పోరాటం చేస్తారని అన్నారు. దేశం కోసం దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం ప్రాణంగా పెట్టి ముందుకు వెళ్తారు అన్నారు. సంఘంలో వ్యక్తి పరివర్తన నుంచి కుటుంబ పరివర్తనం సమాజ పరివర్తనం చెందుతుందని తెలిపారు. కార్యక్రమంలో యువకులు పాల్గొన్నారు.