పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో 144 సెక్షన్ అమలు: నామినేషన్ కేంద్రాల వద్ద కఠిన ఆంక్షలు
పార్వతీపురం మన్యం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సెక్షన్ 30, 163 బి.ఎన్.ఎస్.ఎస్. (144 సెక్షన్) అమలులోకి వచ్చాయి. నామినేషన్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను కల్పిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.