Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

గుంతకల్లు: గుత్తి పట్టణంలోని కరణం వీధికి చెందిన సత్తార్ సాబ్ అనే వృద్ధుడు అదృశ్యం, పోలీసులకు ఫిర్యాదు

Guntakal, Anantapur | Apr 7, 2026
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కరణం విధికి చెందిన సత్తార్ సాబ్ అనే వృద్ధుడు అదృశ్యమయ్యాడు. మంగళవారం కుటుంబసభ్యులు బాష, జిలాన్ లు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గుత్తి పట్టణంలోని కరణం వీధిలో సత్తార్ సాబ్ నివాసం ఉండేవాడు. సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సత్తార్ సాబ్ రాత్రి అయినా తిరిగి రాలేదు. దీంతో బంధువులు, కుటుంబసభ్యులు గాలించారు. చుట్టుపక్కల గాలించినా ఆయన ఆచూకీ లభ్యం కాలేదు. బంధువులు తెలిసిన వారి ఇళ్ల వద్ద గాలించినా జాడ కానరాలేదు. దీంతో కుటుంబసభ్యులు గుత్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సత్తార్ సాబ్ ఫోటో సమీప పోలీసు స్టేషన్ లకు పంపారు.