శ్రీశైలం: శ్రీశైలం దేవస్థానం 8వ ట్రస్ట్ బోర్డ్ సమావేశం. 34 అంశాలకు ఆమోదం తెలిపిన ట్రస్ట్ బోర్డు
శ్రీశైలం దేవస్థానం 8వ ట్రస్ట్ బోర్డ్ సమావేశం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 45 అంశాలను పరిశీలించగా 34 అంశాలకు ఆమోదం తెలిపి, 7 అంశాలను వాయిదా వేసి, 4 అంశాలను తిరస్కరించారు. సామాన్య భక్తుల మౌలిక సదుపాయాలపై ప్రత్యేకంగా చర్చించిన బోర్డు, క్యూ కాంప్లెక్స్, అమినిటీస్ కాంప్లెక్స్, శౌచాలయాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. క్షేత్రంలో పార్కింగ్, హైమాస్ట్ టవర్ లైటింగ్, ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ సదుపాయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అలాగే దేవస్థాన వైద్యశాలకు మందులు, పరికరాల కొనుగోలుకు టెండర్లు పిలవాలని నిర్ణయించింది.