శ్రీశైలం: శ్రీశైలంలో పర్యావరణ పరిరక్షణలో బాగంగా మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించిన చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు,
శ్రీశైలం క్షేత్రంలో పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుడుతూ దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల సమీపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కబంధం, తెల్లమద్ది, బాదం తదితర పలు రకాల మొక్కలను నాటారు. వర్షాకాలం ముగిసేలోగా మల్లన్న క్షేత్ర పరిధిలో ఐదు వేల మొక్కలు నాటాలని ట్రస్ట్ బోర్డు నిర్ణయించినట్లు చైర్మన్ రమేష్ నాయుడు తెలిపారు. అలాగే క్షేత్ర పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నాటే మొక్కల్లో 40 శాతం దేవతా వృక్షాలు ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భక్