శ్రీశైలం: రోడ్లపెంట వద్ద బ్రేకులు ఫెయిల్ అయి కొండను ఢీకొన్న బియ్యం లారీ. లారీలో ప్రయాణిస్తున్న రైతు యాకోబు అక్కడికక్కడే మృతి
ఆత్మకూరు మండలం రోళ్ళపెంట నల్లమల ఘాట్ రోడ్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.బ్రేకులు ఫెయిల్ అయిన బియ్యం లారీ అదుపుతప్పి కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాకోబు అనే రైతు అక్కడికక్కడే మృతి చెందాడు.గుంటూరుకు మిర్చి అమ్మడానికి వెళ్లిన యాకోబు, తిరుగు ప్రయాణంలో బియ్యం లారీలో ఎక్కి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.రోళ్ళపెంట సమీపంలో లారీకి బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి, వాహనం కొండను ఢీకొట్టింది. ఢీకొట్టిన వేళ లారీలో ఉన్న బియ్యం బస్తాలు ఒక్కసారిగా కిందపడడంతో యాకోబుపై పడి తీవ్ర గాయాలయ్యాయి.ఈ ఘటనలో యాకోబు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు.