పొన్నూరు: పెదకాకాని సమీపంలోని హైవేపై మినీ లారీ బోల్తా, డ్రైవర్, క్లీనర్ కు గాయాలు
గుంటూరు జిల్లా మంగళగిరి నుండి చిలకలూరిపేట వైపు వెళ్తూ పెదకాకాని నేషనల్ హైవే పై వెళ్తున్న మినీ లారీ వెనుక టైరు పేలడంతో రోడ్డుకు అడ్డంగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ కి గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి గుంటూరు ప్రభుత్వ వైఎస్ఆర్కు తరలించారు. ఈ సంఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. ప్రమాదానికి గురైన మినీ ట్రక్కును హైవే నుంచి కిందకి తెప్పించడంతో యధావిధిగా వాహనాలు రాకపోకలు జరిగాయి.