నాగులుప్పలపాడు: నాగులుప్పలపాడు జాతీయ రహదారిపై శునకాల గుంపు దాడులతో బెంబేలెత్తుతున్న వాహనదారులు
నాగులుప్పలపాడు జాతీయ రహదారిపై శునకాల గుంపు దడ పుట్టిస్తున్నాయి. ద్విచక్ర వాహనదారులపై శునకాల మూకుమ్మడిగా దాడికి పాల్పడుతున్నాయి. జాతీయ రహదారిపై వెళ్లాలంటేనే ద్విచక్ర వాహనదారులు హడలెత్తిపోతున్నారు. అదేవిధంగా పట్టణంలోని మెయిన్ రోడ్డు, పోలీస్ స్టేషన్ వీధి, బస్టాండ్ సెంటర్లలో శునకాలు గుంపులుగా సంచరిస్తూ రహదారిపై వెళ్లే వారిపై దాడికి పాల్పడుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి శునకాల బెడద లేకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.