నంద్యాల(D) ఆత్మకూరుకు చెందిన ప్రశాంత్ తన అవయవ దానంతో ఆదర్శంగా నిలిచారు. శుక్రవారం బైక్పై వెళ్తూ పాములపాడు (M) భానుముక్కల టర్నింగ్ వద్ద కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు శనివారం ధ్రువీకరించారు. ఆదివారం జీవనాధార్ ద్వారా ప్రశాంత్ అవయవాలను కుటుంబసభ్యులు దానం చేశారు. ఆయన అవయవ దానంతో పలువురు ప్రాణాలు పొందే అవకాశం లభించింది.