కోడుమూరు: గొందిపర్లలో రైతన్నా మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి
కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని గొందిపర్ల గ్రామంలో బుధవారం రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ రైతు సంక్షేమం కోసం సరికొత్తగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. పంట లాభాలు పెంచే విధానాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సబ్సిడీ వివరాలు, భవిష్యత్తు వ్యవసాయ విధానాలపై ఆయన వివరించారు.