శ్రీశైలం: శ్రీశైలం జలాశయం సమీపంలో భారీ ట్రాఫిక్ జామ్. జలాశయం మలుపు వద్ద రోడ్డు సైడ్ మట్టిలో ఇరుక్కుపోయిన ఓ టూరిస్ట్ బస్సు
శ్రీశైలం జలాశయం సమీపంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తెలంగాణ వైపు మలుపు వద్ద ఓ టూరిస్ట్ బస్సు రోడ్డు పక్కకు దిగి మట్టిలో ఇరుక్కుపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. జలాశయం నుంచి దోమలపెంట ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వరకు, మరోవైపు సున్నిపెంట వరకు పలుకిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచింది. భక్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, స్థానికులు బస్సును తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.