కొడిమ్యాల: మల్యాల మండల కేంద్రంలో వెనుక నుంచి ఎర్టిగా కారును ఢీ కొట్టిన రెడీమిక్స్ వాహనం
జగిత్యాల జిల్లా,మల్యాల మండల కేంద్రంలోని,అంగడి బజార్లో ఆగి ఉన్న ఎర్టిగా కారును రెడీమిక్స్ వాహనం ఢీ కొట్టిన ఘటన శనివారం 6:30 PM కి చోటుచేసుకుంది, అంగడి బజార్లో ఒక షాపు పక్కన కారు ఆగి ఉంది కారు పక్క నుండి రెడీమిక్స్ వాహనం వెళుతుండగా రెడీమిక్స్ వాహనానికి మరో వాహనం ఎదురుగా రావడంతో రెడీమిక్స్ వాహన డ్రైవర్ వెనుకనున్న కార్ డ్రైవర్ హార్న్ కొడుతున్న వినిపించుకోకుండా రివర్స్ వచ్చి కారును ఢీ కొట్టాడు,స్థానికులు కేకలు వేయడంతో రెడీమిక్స్ వాహనం కారును ఢీ కొట్టి ఆగిపోయింది,కార్ లో ఉన్న డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయి,కారులో మిగతా ప్రయాణికులు షాపులోకి వెళ్లడంతో పెద్ద పెను ప్రమాదం తప్పింది,