గుంటూరు: గుంటూరు నగరానికి వరద సమస్య నుండి విముక్తి కల్పించండి: కాంగ్రెస్ పార్టీ నాయకులు
Guntur, Guntur | Sep 15, 2025 గుంటూరు నగరానికి వరద సమస్య నుంచి విముక్తి కల్పించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.సోమవారం గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు కాంగ్రెస్ నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో వర్షం వచ్చిన ప్రతిసారీ నీరు నిలిచిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ద్విచక్ర వాహనాలపై తిరిగితేనే ప్రజలు పడుతున్న ఇబ్బందులు, కష్టాలు తెలుస్తాయని అన్నారు.