సిద్దిపేట అర్బన్: ఎన్సాన్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన మంత్రి వివేక్ వెంకట స్వామి
సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి గ్రామంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మంగళవారం ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడి వారిని సన్మానించారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి సహ భక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, సిద్దిపేట ఆర్డీవో సదానందం, ఇతర అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ఎన్సాన్ పల్లి గ్రామంలో లో 127 ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు. మరింత వేగంగా ఇండ్లను నిర్మించుకోవాలి, అధికారులు పర్యవేక్షించాలన్నారు.