పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి: రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు
పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు కోరారు. గురువారం పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలో పత్తి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బామిని మండలంలో సుమారు 5000 మంది రైతులు పత్తిని పండిస్తున్నారన్నారు. పత్తి కొనుగోలు కేంద్రం లేక దళారీలు పత్తిని 1500 రూపాయల కంటే తక్కువగా క్వింటాలు కొంటున్నారని, దీని వల్ల రైతుల నష్టపోతున్నారన్నారు. తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.