ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : మంత్రాలయంలో 97 కోట్ల పెట్టుబడితో నిర్మించరు నా వెంకటేశ్వర లాడ్జ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బీవీ
పుణ్యక్షేత్రం మంత్రాలయంలో రూ.97 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర లాడ్జికి స్థానిక టీడీపీ ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి ఆదోని ఎమ్మెల్యే పార్ధసారథి తో కలిసి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మొత్తం 1.2 ఎకరాల విస్తీర్ణంలో 215 గదులతో ఆధునిక హోటల్, రెస్టారెంట్, లాడ్జ్‌ను నిర్మించనున్నారు. భక్తులకు సౌకర్యవంతమైన వసతి కోసం ఉన్నత ప్రమాణాల సదుపాయాలతో హోటల్, మరియు ఫుడ్ కోర్ట్ నిర్మించనున్నారు. ఈ హోటల్ ద్వారా స్థానికులకు వందల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి తెలిపారు.