అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో సోమవారం ప్రమాదవశాత్తూ ఇంట్లో కాలు జారి పడి నాగరాజు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని ఎస్బిఐ కాలనీకి చెందిన నాగరాజు పట్టణంలోని ఓ హోటల్ లో పని చేసేవాడు. హోటల్ కు వెళ్ళేందుకు ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఇంటి ముందు ఉన్న మెట్ల పై నుంచి జారి పడి నాగరాజు గాయపడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.