ఒంగోలు అర్బన్: 1912 (IVRS) ద్వారా నూతన విద్యుత్ సర్వీస్ కనెక్షన్ దరఖాస్తుల స్వీకరణ సేవ ప్రారంభం.
Ongole Urban, Prakasam | Aug 1, 2026
విద్యుత్ వినియోగదారులకు మరింత సులభమైన, పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) మరో వినూత్న డిజిటల్ సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏపీసీపీడీసీఎల్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ పుల్లారెడ్డి 1912 ఇంటిగ్రేటెడ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (IVRS) ద్వారా నూతన విద్యుత్ సర్వీస్ కనెక్షన్ దరఖాస్తుల స్వీకరణ సేవను అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ, వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ సేవలను పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ దిశగా తీసుకెళ్తున్నామని తెలిపారు