కురుపాం: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల సంచారం: ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం తిత్తిరి పంచాయతీలో ఏనుగుల సంచారం కలకలం రేపుతోంది. ఇప్పటికే జిల్లాలో 12 మంది మృతి చెందగా, 6 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఏనుగులను రెచ్చగొట్టవద్దని, పొలాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలని అధికారులు చాటింపు వేస్తున్నారు.