నారాయణపేట్: నర్వ మండలంలో షార్ట్ సర్క్యూట్ తో ఐదు క్వింటాళ్ల పత్తి దగ్ధం
నర్వ మండలంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఐదు క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. లక్కీర్ దొడ్డి నరసింహ తన వరండాలో నిలువ ఉంచిన పత్తి అగ్నికి ఆహుతైంది. కౌలుకు తీసుకున్న ఐదు ఎకరాల పొలంలో పండించిన పత్తిని ఇంటికి తెచ్చి నిలువ ఉంచగా, ఎవరూ లేని సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వడ్డీకి అప్పు చేసి పెట్టుబడి పెట్టిన రైతు, చేతికి అందాల్సిన పంట కళ్లముందే కాలిపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు