ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులో దీపావళి సందర్భంగా బాణాసంచా దుక్కణాలు జనాలతో కిటకిట..
ఎమ్మిగనూరులో దీపావళి సందర్భంగా బాణాసంచా విక్రయ దుకాణాలు జనాలతో కిటకిటలాడుతున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరంలోనే ఈసారి కూడా ధరలు విపరీతంగా పెరిగాయని ప్రజలు వాపోయారు. నిన్న డి.ఎస్.పి భార్గవి దుకాణాలను తనిఖీ చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని సిబ్బందిని హెచ్చరించారు.