జయశంకర్ భూపాలపల్లి తెలంగాణ లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల సందడి నెలకుంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ తో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. త్రివేణి సంగమం వద్ద భక్తులు పుణ్య పుణ్య స్నానాలు ఆచరించారు. గోదావరి మాతకు దీపాలు వెలిగించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంకు చేరుకొని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక అభిషేకాలు చేశారు. పార్వతి, శుభనంద దేవిలకు కుంకుమార్చనలు, విశేష పూజలు నిర్వహించారు .