ఎమ్మిగనూరు: భూసార పరీక్షల ఆధారంగానే ఎరువులను వాడాలని నందవరం మండల వ్యవసాయ అధికారి సరిత తెలిపారు..
ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలో భూసార పరీక్షల ఆధారంగానే ఎరువులను వాడాలని నందవరం మండల వ్యవసాయ అధికారి సరిత అన్నారు. మంగళవారం జరిగిన 'భూమాత సంరక్షణ, పొలం పిలుస్తుంది' కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కాంప్లెక్స్ ఎరువుల అధిక వాడకం వల్ల భాస్వరం ఎక్కువై, మొక్కలు సూక్ష్మ పోషకాలను తీసుకోలేకపోతాయని, తద్వారా పంట దిగుబడి తగ్గుతుందని ఆమె వివరించారు.మండలంలోని ఏనుగుబాల, దైవందీన్నే గ్రామాలలో మంగళవారం 'పొలం పిలుస్తోంది' కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి ఎం. శివ శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏఈవోలు, గ్రామ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.