శ్రీశైలంలో దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుల సమావేశం 15 అంశాలకు ఆమోదం
శ్రీశైలం దేవస్థానంలో ఆరు గంటలపాటు జరిగిన ట్రస్ట్ బోర్డు సమావేశం సాయంత్రం ముగిసింది. అనారోగ్య కారణాలతో చైర్మన్ రమేష్ నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈవో శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.సమావేశంలో మొత్తం 15 అంశాలకు ఆమోదం తెలపగా, 5 అంశాలను వాయిదా వేశారు, 2 అంశాలను తిరస్కరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొత్త క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ప్రస్తుత డార్మెంటరీలను ఆధునికీకరించడంతో పాటు కొత్త డార్మెంటరీలను నిర్మించనున్నారు.