మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలని హిందూపురం అంబేద్కర్ సర్కిల్లో ధర్నా నిర్వహించిన వైఎస్ఆర్సిపి ఎస్సి విభాగం
శ్రీ సత్య సాయి జిల్లా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలని హిందూపురం అంబేద్కర్ సర్కిల్లో వైఎస్ఆర్సిపి ఎస్సి విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తే దళితులు బడుగు బలహీన వర్గాలు వైద్య విద్యకు దూరమవుతారని అన్ని వర్గాలు సంఘటితమై పోరాడాలని మడకశిర వైఎస్ఆర్సిపి సమన్వయకర్త ఈరలకప్ప పిలుపునిచ్చారు మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలకప్ప, హిందూపురం వైసిపి నాయకులు వేణు రెడ్డి, వైఎస్ఆర్సిపి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు నరసింహమూర్తి వైఎస్ఆర్సిపి దళిత నాయకులు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.