హిమాయత్ నగర్: మూసీ ప్రక్షాళన, మూసీ పునఃనిర్మాణం, మూసీ భవిష్యత్ ప్రణాళికలతో ముందుకు పోతున్నాం: మంత్రి పొన్నం ప్రభాకర్
మలక్ పేట నియోజకవర్గంలోని సైదాబాద్ మండలంలోని పిల్లి గుడిసెలలో ఉన్న డబుల్ బెడ్రూంలను మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసీ పాత నగరం గా కాకుండా పురోగతి చెందే నగరంగా మూసి రూపుదిద్దుకుంటుందని అన్నారు. హైదరాబాద్లో కొత్త ఇనోవేటెడ్ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం, మూసి ప్రక్షాళన, మూసి పునః నిర్మాణం మూసి భవిష్యత్ ప్రణాళికలతో పోతున్నమని అన్నారు.