భీమిలి: మధురవాడ రైతుబజార్లో రాయితీ ఉల్లి అమ్మకాలు ప్రారంభం
మధురవాడ రైతుబజార్లో రాయితీ ధరలకు ఉల్లిపాయల విక్రయాలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. నిత్యావసర ధరల స్థిరీకరణలో భాగంగా ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.