నందికోట్కూరు: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తెలుగు గంగా ఎస్ఆర్బిసి ఆయకట్టుకు 2000 క్యూసెక్కుల నీటి విడుదల
నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి అధికారులు నీటి విడుదల ప్రారంభించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 5, 6 గేట్లకు పూజలు నిర్వహించి దిగువకు నీటిని విడుదల చేశారు. దీనితో తెలుగు గంగా, SRBC ఆయకట్టుకు నీరందించనున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ లోని 5, 6 గేట్ల ద్వారా సెకనుకు 2000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందుగా గేట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నీటి విడుదల చేపట్టారు. విడుదల చేసిన నీటిని తెలుగు గంగా ప్రాజెక్టు, SRBC కెనాల్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని తాగునీటి, సాగునీటి అవసరాలకు వినియోగించనున్నారు.