మండపేట: మండపేట నియోజకవర్గంలో సాధారణ తనిఖీల్లో
రు 4. 16 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్న అదికారు..
ఎన్నికల సమయం లో మండపేట నియోజకవర్గం లో చేపట్టిన సాధారణ తనిఖీల్లో నగదు స్వాధీనం చేసుకున్నారు. మండపేట నియోజకవర్గ ఎన్నికల అధికారి ఎల్లరావు దీనికి సంబంధించిన వివరాలు శనివారం సాయంత్రం వెల్లడించారు. కే కృష్ణ కాంత్ కు చెందిన కారులో రూ లక్ష వున్నట్లు గుర్తించారు.ఆధారాలు లేకపోవడం తో జెడ్ మేడపాడు లో ఎస్ ఎస్ టి బృందం అధికారి టి వెంకట లక్ష్మి మోటర్ సైకిల్ ను తనిఖీ చేశారు. ఆ ద్విచ్రవాహనం లో 2.46 లక్షలు కనుగొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరు కు చెందిన ఉయ్యూరు శ్రీనివాస్ రాజు రు 70 వేలు కారులో వున్నట్లు కనుగొన్నారు. వీటిపై కేసులు నమోదు చేశారు.